Header Banner

పాకిస్తాన్ సముద్రంలో రెండు రోజుల పాటు భారీ సైనిక విన్యాసాలు! ఎయిర్-టు-ఎయిర్ లైవ్ ఫైరింగ్ కసరత్తులు!

  Thu Apr 24, 2025 14:16        Others

పాకిస్తాన్ నావికాదళం కీలక సైనిక విన్యాసాలకు సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ కసరత్తులు కొనసాగనున్నాయి. కరాచీ, గ్వాదర్ పోర్టుల సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో ఈ విన్యాసాలు జరగనున్నట్లు పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో లైవ్ ఫైరింగ్ (ఎయిర్-టు-ఎయిర్ లైవ్ ఫైరింగ్) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సైనిక విన్యాసాల నేపథ్యంలో, నిర్దేశిత ప్రాంతాల్లో సాధారణ నౌకలు, విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కరాచీ, గ్వాదర్ పోర్టులకు సమీపంలోని విన్యాసాలు జరిగే ప్రాంతానికి దూరంగా ఉండాలని వాణిజ్య నౌకలు, ఇతర విమానాలకు పాకిస్తాన్ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ ఆంక్షలు రెండు రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ కసరత్తుల్లో పాకిస్తాన్ నౌకాదళం తమ యుద్ధ సంసిద్ధతను పరీక్షించుకోనుంది. ముఖ్యంగా, ఎయిర్-టు-ఎయిర్ లైవ్ ఫైరింగ్ తో పాటు, యుద్ధ నౌకల నుంచి క్షిపణులను ప్రయోగించడం ద్వారా వాటి సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. అలాగే, పాకిస్తాన్ నౌకాదళ అమ్ములపొదిలో కీలకమైన సబ్ మెరైన్ల కార్యాచరణ సామర్థ్యం, వాటి సన్నద్ధతపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఈ విన్యాసాలు పాకిస్తాన్ నావికా, వాయుసేనల మధ్య సమన్వయాన్ని, అత్యాధునిక ఆయుధ వ్యవస్థల పనితీరును సమీక్షించడంలో భాగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: కాశ్మీర్‌లో లష్కరే తొయిబా ఓజీడబ్ల్యూ మాడ్యూల్‌ సభ్యుల అరెస్ట్! ఏకంగా చైనీస్ ఆయుధాలతో!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PakistanNavy #MilitaryExercises #LiveFiring #AirToAir #NavalDrills #Karachi #Gwadar #Defense